
పటాన్చెరు, వెలుగు: అభం, శుభం తెలియని చిన్నారులను పటాన్చెరు బస్టాండ్‌లో వదిలివెళ్లిన ఘటన కలచివేసింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్‌లో సోమవారం సాయంత్రం ఐదేండ్ల లోపు ఉన్న ఇద్దరు చిన్నారులను వదిలివెళ్లారు. మాటలు కూడా సరిగా రాని పాప, బాబులను గమనించిన స్వీపర్ చిన్నారులను అక్కున చేర్చుకుంది.
పిల్లలకోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసినా రాలేదు. దీంతో వారిని తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి పడుకోబెట్టింది. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వారు చిన్నారులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. చిన్నారులు సరిగా మాట్లాడలేకపోవడంతో సమాచారం రాబట్టలేకపోయారు. శిశు సంరక్షణ అధికారులకు సమాచారం అందించి, వారి సంరక్షణలో పిల్లలను ఉంచారు. పిల్లల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ ప్రవీణ్‌రెడ్డి కోరారు.