ప్రభుత్వ స్థలం కాపాడాలని చిన్నారుల ఆందోళన

ప్రభుత్వ స్థలం కాపాడాలని చిన్నారుల ఆందోళన

హైదరాబాద్  హైదర్ నగర్ లోని శ్రీనివాస కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ ఆందోళన చేశారు కాలనీ వాసులు, చిన్నారులు. సర్వే నెంబర్ 95లోని ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జాల ప్రయత్నాల గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలు ఆడుకునేందుకు ఖాళీ స్థలాలు లేవని.. అలాగే కుటుంబ సభ్యులు లేదా ఇరుగు పొరుగుతో కలసి సెద తీరేందుకు వీలుగా.. వాకింగ్ చేయాలనుకునే వారికి కూడా  ఉపయోగపడేలా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో పార్కును ఏర్పాటు చేయాలని వారు కోరారు.