అంగన్ వాడీ సెంటర్లలో చిన్నారుల గోస

అంగన్ వాడీ సెంటర్లలో చిన్నారుల గోస

హైదరాబాద్ : రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో నగరవాసులు తల్లడిల్లిపోతున్నారు. మధ్యాహ్నం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండకు పెద్దవాళ్లే తట్టు కోలేక పోతున్నారు, ఇంకా చిన్న పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంటి వద్ద ఆడుకునే పిల్లలదైతే తల్లిదండ్రులు చూసుకుం టారు. మరీ అంగన్ వాడీ సెంటర్లకు వెళ్తున్న చిన్నారుల గోస చూసేదేవరు? వీరంతా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాఅధికారులు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు.

రేకుల గదిలో సెంటర్లు….

జిల్లా వ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో 914 అంగన్ వాడీ సెంటర్లు ఉన్నాయి. సొంత భవనాలు 14 , ప్రభుత్వ స్కూళ్లలో 29, కమ్యూనిటీ హళ్లలో139 , కిరాయి గదులలో 732 సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటిలో అధికంగా రేకుల గదులలోనే ఉన్నాయి. ఇందులో సరైన వసతులు లేకపోవడం ఒకటైతే.. కరెంటు, ఫ్యాన్లు లేకపోవడంతో సెంటర్లకు వస్తున్న పిల్లలకు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ ప్రాజెక్టు పరిధిలో…

చార్మినార్‌‌‌‌, గోల్కొండ, ఖైరతాబాద్‌ , నాంపల్లి, సికింద్రాబాద్‌ ప్రాజెక్టుల పరిధిలోని732 అంగన్‌‌‌‌వాడీలలో సగం సెంటర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయమే సెంటర్లకు చేరుకుంటున్న చిన్నారులు మధ్యాహ్నం ఆ గదులలో ఉంటున్న వేడితో తట్టు లేకపోతున్నారు. కొన్ని సెంటర్లలో తాగు నీరు కూడా అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు.

బడ్జెట్ లేదంటున్న అధికారులు….

ఈ విషయాన్ని సెంటర్ల టీచర్లు సూపర్ వైజర్లతో పాటు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదు. కిరాయి గదులలో నడుస్తున్న సెంటర్లకు డబ్బులు చెల్లించడమే కష్టం గా ఉంది. ప్రస్తుతానికి కరెంటు, ఫ్యాన్లు ఏర్పాటు చేసేం దుకు బడ్జెట్ ఎక్కడుందని ఉన్నాతాధికారుల చెప్తున్నారని కొన్ని సెంటర్ల ప్రతినిధులు తెలిపారు.

కొరవడిన నిఘా….

చిన్నారులతో పాటు గర్భిణీలకు రోజువారీగా పౌష్టికాహారం అందుతుం దా లేదా అనే దానిపై నిఘా కొరవడిం ది. ముఖ్యం గా సెక్టర్ల పరిధిలోని ఆఫీసర్లు, సూపర్ వైజర్లు ఎప్పటికప్పుడు అంగన్ వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న పౌష్టికాహారంపై పర్యవేక్షణ లేదు. ప్రస్తుతానికి సెంటర్లలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ నిర్లక్ష్యం చేయవద్దనే సూచనలు చేస్తున్నది. అయినా సర్కా రు ఆదేశాలను ఎవరూ పట్టిం చుకోవడం లేదు. ఫలితంగా అంగన్ వాడీ సెంటర్లకు వెళుతున్న చిన్నారులు ఎండలకు తల్లడిల్లిపోతున్నారు.