చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్.. ప్రి క్వార్టర్స్లో సాత్విక్- చిరాగ్‌‌‌‌‌‌‌‌

చైనా మాస్టర్స్  బ్యాడ్మింటన్ టోర్నమెంట్.. ప్రి క్వార్టర్స్లో సాత్విక్- చిరాగ్‌‌‌‌‌‌‌‌

షెన్‌‌‌‌జెన్ (చైనా): ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్‌‌‌‌ సాయిరాజ్, చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌లో  ముందంజ వేశారు. బుధవారం (సెప్టెంబర్ 17) జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌‌‌‌లో 24-–22, 21–-13తో  జునైది ఆరిఫ్– రాయ్ కింగ్ (మలేసియా) నెగ్గి ప్రి-క్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించారు. 

అయితే,  మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో  షట్లర్ లక్ష్య సేన్ తొలి రౌండ్ మ్యాచ్‌‌‌‌లో 11-–21, 10–-21తో  పోపోవ్ (ఫ్రాన్స్‌‌‌‌) చేతిలో ఓడగా,  మిక్స్‌‌‌‌డ్ డబుల్స్‌‌‌‌లో ధ్రువ్ కపిల– తనీషా క్రాస్టో  19–-21, 13–-21తో రెండో సీడ్ ఫెంగ్ యాన్– హువాంగ్ డాంగ్ పింగ్‌‌‌‌ చేతిలో ఓడి ఇంటిదారి పట్టారు.