చైనా విదేశాంగ మాజీ మంత్రి అనుమానాస్పద మృతి

 చైనా విదేశాంగ మాజీ మంత్రి అనుమానాస్పద మృతి

బీజింగ్ :  చైనా విదేశాంగ శాఖ మాజీ మంత్రి క్విన్ గాంగ్ అనుమానాస్పద రీతిలో మృతిచెందడం ఆ దేశంలో సంచలనం సృష్టిస్తున్నది. గత జులైలో అదృశ్యమైన క్విన్ గాంగ్.. సూసైడ్ చేసుకొని ఉంటాడని లేదంటే చిత్రహింసలకు గురి చేసి చంపేసి ఉంటారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దేశ రాజధాని బీజింగ్‌‌‌‌లోని మిలిటరీ ఆస్పత్రిలో క్విన్ గత జులై చివరలో మరణించినట్లు చైనా ఉన్నతాధికారులతో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించారని ‘పొలిటికో’ పత్రిక తెలిపింది.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలకు ఆ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తారని పేర్కొంది. అయితే, అమెరికాలో అంబాసిడర్‌‌‌‌గా ఉన్న సమయంలో క్విన్‌‌‌‌కు ఓ టీవీ జర్నలిస్ట్ తో వివాహేతర సంబంధం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ గతంలో పేర్కొంది. వారిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టినట్టు వెల్లడించింది. ఈ విషయంపై చైనాలో ఆయన విచారణకు సహకరిస్తున్నారని తెలిపింది. సదరు టీవీ జర్నలిస్ట్ తో వివాహేతర సంబంధమే ఆయన కనిపించకుండా పోవడానికి కారణమని కూడా వార్తలు వచ్చాయి.