చైనా యాప్స్‌ బ్యాన్‌తో దేశీ రీసర్చర్స్‌కు మంచి చాన్స్

చైనా యాప్స్‌ బ్యాన్‌తో దేశీ రీసర్చర్స్‌కు మంచి చాన్స్

కోల్‌కతా: చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం మన దేశ రీసర్చర్స్‌కు, మార్కెట్‌కు చాలా ఉపయోగం అని ఐఐటీ ఖరగ్‌పూర్‌‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. స్టార్టప్స్‌, ప్రాజెక్టులకు స్పాన్సర్‌‌షిప్ లభిస్తే రీసర్చర్స్‌తోపాటు స్టూడెంట్స్‌ కూడా మరింత శ్రమించే అవకాశం ఉంటుందని ఓ ప్రకటనలో ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీరేంద్ర కుమార్ తివారీ తెలిపారు.

‘స్టూడెంట్స్‌ డెవలప్ చేసిన ప్రాజెక్టులకు సంబంధించి సబ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాం. వాటిని మేం స్పాన్సర్ చేస్తాం. పెద్ద మొత్తంలో డిజిటల్ స్పేస్‌లో టాలెంటెడ్ వాళ్లను అందిచగల ఐఐటీ లాంటి ఇన్‌స్టిట్యూట్స్‌ ఇలాంటి గోల్స్‌ను చేరుకోలేకపోతే ఆశ్చర్యమనే చెప్పాలి’ అని తివారీ పేర్కొన్నారు. ‘చైనా యాప్స్‌పై బ్యాన్‌తో మార్కెట్‌లో కొంత అసమతుల్యత లోపించింది. దీని వల్ల ఇండియన్ స్టార్టప్స్‌కు మంచి అవకాశం లభించింది. మా టెక్నలాజికల్ రీసెర్చ్ కూడా అటువంటి ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే స్థాయికి చేరుకుంది’ అని డీన్ ఆఫ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సుమన్  చక్రవర్తి చెప్పారు.