
మెగాస్గార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపుతున్నారు. లాస్ట్ ఇయర్ ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరు.. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి మెగా సక్సెస్‌ను అందుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. కొత్త షెడ్యూల్‌ను మంగళవారం నుంచి మొదలుపెట్టారు. దీనికోసం హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్‌ను వేశారు.
‘పాజిటివ్ ఎనర్జీతో మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్’ను తిరిగి ప్రారంభించామని చెప్పిన మెహర్ రమేష్.. ఇందులో చిరంజీవి స్టైలిష్ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడన్నారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. తిరుపతి మామిడాల డైలాగ్స్ రాస్తున్నారు.