కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఇక్కడ పనిచేసిన పమేలా సత్పతి కార్మిక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. సంగారెడ్డికి చెందిన చిత్రా మిశ్రా 2019 తెలంగాణ బ్యాచ్‌కు చెందినవారు. ఆమె ఇప్పటివరకు ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా పనిచేశారు. ప్రభుత్వం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. దీనిలో భాగంగా చిత్రా మిశ్రా కరీంనగర్ కలెక్టర్‌గా వచ్చారు.
స్ర్తీ, శిశు సంక్షేమంలో పమేలా మార్క్
కరీంనగర్ కలెక్టర్‌గా 2023 అక్టోబర్31 నుంచి బాధ్యతలు స్వీకరించిన పమేలా సత్పతి.. స్త్రీ, శిశుసంక్షేమం, విద్య రంగంలో తనదైన మార్క్ చూపించారు. శుక్రవారంసభ పేరిట ప్రతీ మహిళలకు ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచిత పరీక్షలు, డెలివరీలు, మహిళల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్‌వాడీలు, ప్రైమరీ స్కూళ్ల అభివృద్ధికి కృషి చేశారు. ఆయా స్కూళ్లలో చిన్నారులు చదువుపట్ల ఆసక్తి చూపేందుకు అనేక కార్యక్రమాలు అమలుచేశారు. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల కోసం టెడ్ టాల్క్స్ పేరిట శిక్షణ, సమాజ సేవ, స్టూడెంట్, టీచర్ పేరెంట్ మీటింగ్స్, ఇన్నోవేషన్స్, తదితర కార్యక్రమాలు చేపట్టారు. శానిటేషన్ కార్మికులకు బీమా, ఆరోగ్య పరీక్షలు, రక్షిత పరికరాలు అందించారు.
