ప్రయాణికులపై చెప్పుతో దాడి: చిత్తూరు రైల్వే అధికారి సస్పెండ్

ప్రయాణికులపై చెప్పుతో దాడి:  చిత్తూరు రైల్వే అధికారి సస్పెండ్

చిత్తూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులపై ఓ అధికారి చెప్పుతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టికెట్ కౌంటర్ దగ్గర జరిగిన వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. దీంతో సంయమనం కోల్పోయిన అధికారి చెప్పుతో దాడికి దిగింది. ఈ ఘటనలో గుంతకల్లు రైల్వే డివిజన్‌లో కమర్షియల్ విభాగం RS-2/CTO హోదాలో పనిచేస్తున్న కె. జ్యోతి‌ని సస్పెండ్ చేశారు అధికారులు.

గొడవకు సంబంధించి అధికారి చెప్పుతో దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో  దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్ జూన్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విధులు, వేతనం నుంచి సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.