మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం చొప్పదండి పట్టణంలోని 10వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి మున్సిపాలిటీని అధిక మెజారిటీతో  కైవసం చేసుకోబోతున్నట్లు తెలిపారు. అభివృద్ధి, పథకాలతో  ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారన్నారు. చొప్పదండి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై పనిచేస్తున్నాయని, ఆ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 

ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

మల్యాల, వెలుగు: మల్యాల మండలం ముత్యంపేట (కొండగట్టు) గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ జమదగ్ని రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి ప్రతిఒక్కరినీ చల్లంగా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి, సర్పంచ్ దారం ఆదిరెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, పాల్గొన్నారు.