ఫీల్‌‌గుడ్ లవ్‌‌స్టోరీ : యష్ మాస్టర్

ఫీల్‌‌గుడ్ లవ్‌‌స్టోరీ :  యష్ మాస్టర్

కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కార్తీక ముర‌‌ళీధ‌‌ర‌‌న్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.  శశికుమార్ ముతులూరి దర్శకుడు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌‌‌‌లో  హ‌‌ర్షిత్‌‌, హ‌‌న్షిత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. టీజర్‌‌‌‌ను బట్టి ఇదొక ఫీల్‌‌గుడ్ లవ్‌‌స్టోరీగా తెలుస్తోంది.  

యష్, కార్తీక మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ర్యాంపీ నందిగాం అందించిన విజువల్స్,  కార్తీక్ ఇచ్చిన మ్యూజిక్, మధ్యలో యష్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌‌ హైలైట్‌‌గా ఉన్నాయి. ‘బలగం’లాంటి హిట్ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌ నుంచి వస్తోన్న రెండో చిత్రం కావడంతో దీనిపైనా అంచనాలున్నాయి.