విరాట్‌ తర్వాత రాహులే: క్రిస్‌గేల్‌

విరాట్‌ తర్వాత రాహులే:  క్రిస్‌గేల్‌

ఆశ్విన్‌ సూపర్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌

న్యూఢిల్లీ: లోకేశ్‌ రాహుల్‌ అద్భుతమైన ఆటగాడని, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కి ధీటైనవాడని యూనివర్స్‌‌‌‌‌‌‌‌ బాస్‌ క్రిస్‌గేల్‌ అన్నాడు . రాహుల్‌ తన జోన్‌ లో తాను ఉంటే కోహ్లీ స్థాయిని అందుకుంటాడన్నాడు.  ‘ ప్రస్తుతమున్న ఇండియా క్రికెటర్ల గురించి ప్రస్తావన వస్తే నాకు గుర్తొచ్చే పేర్లలో రాహుల్‌ కచ్చితంగా ఉంటాడు. విరాట్‌ సాధించిన ఘనతలను లోకేశ్‌ అధిగమిస్తాడు . ఆ సత్తా అతనిలో ఉంది. అయితే ఇతరులతో పోటీపడుతూ అనవసరంగా ఒత్తిడి గురికాకుంటే రాహుల్‌ కి మేలు. ఇండియాలో చాలా టాలెంట్‌ ఉంది. కానీ, అందరికీ అవకాశాలు దొరకడం లేద’ని గేల్​ చెప్పాడు . ఇక,రెండే ళ్లుగా కింగ్స్‌‌‌‌‌‌‌‌ లెవన్‌ ఫ్రాంచైజీతో తనకు మంచి అనుబంధం ఉందన్న గేల్‌ .. పంజాబీ స్టైల్‌ బాగా నచ్చిందన్నాడు . ఫ్రాంచైజీ కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నానని తెలిపాడు. అంతకంటే ముందే జట్టును ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌కు చేర్చడం తమ లక్ష్యమని క్రిస్‌ పేర్కొన్నాడు .రవిచంద్రన్‌ అశ్వి న్‌ సూపర్‌ కెప్టె న్‌ అని, అశ్విన్‌ తనని తాను ఎంత నమ్ముతాడో జట్టుపై కూడా అదే నమ్మకంతో ఉంటాడని గేల్​ తెలిపాడు.