కామారెడ్డి జిల్లా : లంచం కేసులో బిక్కనూర్ సీఐ యాలాద్రిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. దోమకొండ మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయగౌడ్ హత్య కేసులో నిందితుని నుంచి సీఐ డబ్బులు తీసుకున్న విషయంలో ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర. హత్య కేసు నిందితుడు హన్మగౌడ్ తో సీఐ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే మంగళవారం సీఐ యాలాద్రిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర.
