సిటీలో 54 మంది సీఐల బదిలీలు

సిటీలో 54 మంది సీఐల బదిలీలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్​పరిధిలోని 54 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ నుంచి పెద్ద సంఖ్యలో సీఐలు ఇతర వింగ్​లకు బదిలీ అయ్యారు.  వీరిలో 28 మందికి వివిధ చోట్ల పోస్టింగ్​లు ఇవ్వగా..  26 మంది పోస్టింగ్​లను  పెండింగ్ లో పెట్టారు. వీరిని తన ఆఫీసులో రిపోర్ట్ చేయాలని  హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. 

కమిషనరేట్ల పునర్విభజనలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ కమిషనరేట్లలో కొత్తగా ఏర్పడిన జోన్లకు అధికారులను కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ట్రాఫిక్, అడ్మిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీపీలను నియమించారు. ఇప్పుడు  సీఐల బదిలీలు జరిగాయి.