పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల మరింత స్పీడు పెంచారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ తెరకెక్కాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మలయాళ ఫిల్మ్ మేకర్ దింజిత్ అయ్యతన్.. ప్రభాస్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది అతను ‘ఎకో’ అనే సినిమాను ఐదు కోట్ల బడ్జెట్‌తో తీసి యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు.
అంతకంటే ముందు తీసిన ‘కిష్కింధకాండ’ సినిమా కూడా ఇదే తరహాలో మెప్పించింది. ఈ రెండు చిత్రాలు ఓటీటీ ద్వారా తెలుగులోనూ మెప్పించాయి. చిన్న చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న అయ్యతన్.. ఇప్పుడు ప్రభాస్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. తన జీవితంలో మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్‌కు, ఈ మీటింగ్ ఏర్పాటుచేసిన నిర్మాత విజయ్ కిరగందూర్‌కు థ్యాంక్స్ అంటూ ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను దింజిత్ అయ్యతన్ షేర్ చేశాడు.
హోంబలే ఫిలిమ్స్ అధినేత ఈ మీటింగ్ ఏర్పాటు చేయడంతో ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ కాకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి చిన్న చిత్రాలతో అద్భుతాలు సృష్టించిన ఈ మలయాళ దర్శకుడు ఒకవేళ ప్రభాస్‌తో సినిమా చేస్తే అది ఎలా ఉండబోతోంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
