హోం ఐసోలేషన్ సెంటర్లకు సిటిజన్ సాయం

హోం ఐసోలేషన్ సెంటర్లకు సిటిజన్ సాయం


హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో కరోనా సెకండ్ వేవ్ తో వైరస్ వేగంగా స్ర్పెడ్ అయ్యి కేసులు పెరిగాయి. హోం ఐసోలేషన్​లో ఉంటోన్న కరోనా పేషెంట్లలో చాలామంది ఫుడ్, మెడిసిన్ కోసం ఇబ్బంది పడుతున్నారు.  అలాంటి వారికి సాయం చేసేందుకు సిటీ జనం ముందుకొస్తున్నారు. హోం ఐసోలేషన్​లోని  కరోనా పేషెంట్లకు అండగా నిలబడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలతో సంబంధం లేకుండా తమకు తోచిన సాయం చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరి నుంచి ప్రైవేటు ఎంప్లాయీస్ వరకు చాలామంది కరోనా పేషెంట్లకు ఫ్రీ ఫుడ్, మెడిసిన్, నిత్యావసరాలను అందిస్తున్నారు. మరికొందరు పేదలు, వలస కూలీలు, చిల్డ్రన్స్ హోమ్ కు ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ అందుబాటులో ఉంటుందనే సమాచారం, బెడ్లు ఖాళీగా ఉన్న హాస్పిటల్స్ వివరాలను అవసరమైన పేషెంట్లకు షేర్ చేస్తున్నారు.

సెల్ఫ్​ వలంటీర్లుగా..

హోం ఐసోలేషన్​లోని కరోనా పేషెంట్లకు సాయం చేసేందుకు కొందరు ప్రైవేటు ఎంప్లాయీస్, స్టూడెంట్స్ సెల్ఫ్ వలంటీర్లుగా మారుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఇతర జాబ్​లు చేసేవారు టీమ్ గా మారి ఇంట్లో ఐసోలేట్ పేషెంట్ల కోసం హోం మేడ్ ఫుడ్​ ను డెలివరీ చేస్తున్నారు. మెడిసిన్స్ కోసం బయటకెళ్లలేక ఇబ్బంది పడే వృద్ధులకు ఫ్రీగా వాటిని ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నారు. ఇందుకోసం కేవలం మెడిసిన్స్ చార్జీలను మాత్రమే వసూలు చేస్తున్నారు.  మాదాపూర్, బోయిన్ పల్లి, కూకట్​పల్లి, అల్వాల్, లాల్ బజార్, బొల్లారం, సూరారం, ఖైరతాబాద్, హఫీజ్ పేట, తార్నాక ఇలా సిటీలోని చాలా ప్రాంతాల్లో ఉంటోన్న యువకులు, ప్రైవేటు ఎంప్లాయీస్ కరోనా పేషెంట్లకు ఆసరాగా నిలుస్తున్నారు.

 సింగిల్​గానే సర్వీస్..

స్వచ్ఛంద సంస్థలతో సంబంధం లేకుండా చాలమంది సింగిల్​గానే కరోనా పేషెంట్లకు సాయం చేస్తున్నారు. దీంతో పాటు  హాస్పిటల్​లో ఎమర్జెన్సీ బెడ్ రిక్వైర్ మెంట్, బ్లడ్, ప్లాస్మా అవసరం ఉన్న వారి కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎవరైనా రెస్పాండ్ అయితే ఆ సమాచారన్ని అవసరమున్న పేషెంట్లకు తెలియజేస్తున్నారు.  కొందరు ప్రైవేటు ఎంప్లాయీస్ జాబ్ చేసుకుంటూనే ఖాళీ టైమ్​లో హోం ఐసోలేషన్​లో ఉంటోన్న వారికి ఫ్రీ ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. మెడిసిన్స్ కావాల్సిన వారి కోసం మరికొందరు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. 

డైలీ 100 మందికి ఫుడ్ 

నా ఫ్రెండ్స్ తో కలిసి హోం ఐసోలేషన్ లో ఉంటోన్న కరోనా పేషెంట్లు 100 మందికి డైలీ ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేస్తున్నా.  వృద్ధులు, దివ్యాంగులకు ఎమర్జెన్సీ టైమ్​లో ఫ్రీ ఫుడ్, మెడిసన్ అందిస్తున్నాం. డైలీ ఉదయం 11 గంటల నుంచి రోడ్డు పక్కన ఉండే వారికి ఫుడ్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మౌత్ పబ్లిసిటీ ద్వారా అవసరమున్న వారు మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు.
- విజయ్, ప్రైవేటు ఎంప్లాయ్, బోయిన్ పల్లి

చిల్డ్రన్​ హోమ్​కి...

కరోనా టైమ్​లో అనాథాశ్రమంలో  ఉండే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించా. వారికి సాయం చేయాలనుకున్నా.  మా ఇంటికి దగ్గరలోని చిల్డ్రన్ హోమ్ కి వెళ్లి వారికి కావాల్సిన నిత్యావసరాలు, బట్టలు, మాస్క్​లు, శానిటైజర్లను అందిస్తున్నా.
- రాజశేఖర్, ప్రైవేటు ఎంప్లాయ్, అల్వాల్

జాబ్ చేస్తూ సోషల్ సర్వీస్

ఒకే ఇంట్లోని వారందరూ కరోనా బారిన పడితే ఫుడ్​కు ఇబ్బందిగా ఉంటుంది. బయటికెళ్లి మెడిసిన్స్ కూడా తెచ్చుకోలేరు. అలాంటి వారి కోసం ఫ్రీగా ఫుడ్ , మెడిసిన్స్ డెలివరీ చేస్తున్నా. ముఖ్యంగా కరోనా బారిన పడ్డ దివ్యాంగులకు ఎక్కువగా హెల్ప్ చేస్తున్నా.   
- మోహన్ శేఖర్, ఐటీ ఎంప్లాయ్, బొల్లారం

మెడిసిన్స్ డోర్ డెలివరీ చేస్తున్నా..

సెకండ్ వేవ్​తో కేసులు పెరుగుతుండటంతో కరోనా పేషెంట్లకు సాయం చేయాలనుకున్నా. ట్విటర్​లో పోస్టు చేశా. అప్పటి నుంచి నాకు  కాల్స్ వస్తున్నాయి. హాస్పిటల్​ లో బెడ్స్ రిక్వైర్ మెంట్, ప్లాస్మా గురించిన సమాచారం కోసం కరోనా పేషెంట్లు కాంటాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ ఏరియాలో మెడిసిన్స్ డోర్ డెలివరీ చేస్తున్నా. 
- రికిత్ షాహి, లా స్టూడెంట్