బిర్యానీ, హలీమ్, ఐస్ క్రీమ్..ఇంటికి తీసుకెళ్లొచ్చు

బిర్యానీ, హలీమ్, ఐస్ క్రీమ్..ఇంటికి తీసుకెళ్లొచ్చు

హైదరాబాద్, వెలుగు: 50 రోజులు దాటింది. హైదరాబాదీ బిర్యానీ లేదు, రంజాన్ మొదలైనా హలీమ్ వాసన తగల్లేదు. కొందామన్నా, తిందామన్నా లాక్ డౌన్​తో హోటళ్లు, రెస్టారెంట్లు తీయకపాయె అనుకున్న వాళ్లు థర్డ్ ఫేజ్ లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో వాటి రుచి చూస్తున్నారు.

ఆర్డర్​ తీసుకుని..

రెస్టారెంట్లు, హోటళ్లు టేక్ అవే స్టార్ట్ చేయడంతో సిటిజన్స్ తమ ఫెవరేట్ ఫుడ్ తెచ్చుకుని లాగించేస్తున్నారు. హెల్దీ కాంబోలు, సౌత్, నార్త్ ఇండియన్ కాంబో, పరాఠా కాంబో, బిర్యానీ కాంబో వంటి మెన్యూతో టేక్ అవే లిస్ట్ ని రెస్టారెంట్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. పిజ్జా, బర్గర్ లవర్స్ కోసం డోమినోస్ లాంటి షాప్స్ ఆర్డర్​ తీసుకుని డోర్ డెలివరీ చేస్తున్నాయి. ఉదయం10 నుంచి రాత్రి 7 గంటల వరకు టేక్ అవే సర్వీస్ ఉంటుందని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. మాస్క్ లు, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటెన్ చేస్తున్నట్లు తెలిపారు. బికనీర్ వాలా, కరాచీ, మినర్వా, క్రీమ్ స్టోన్, హోటల్ మెర్క్యూర్ వంటి ఫేమస్ రెస్టారెంట్స్, హోటల్స్ టేక్ అవే ఇస్తున్నాయి.

సమ్మర్ లో కూల్ గా..

సమ్మర్ లో ఆల్ఫాంజో ఐస్ క్రీమ్ కి ఉండే క్రేజే వేరు. లాక్ డౌన్ తో పార్లర్స్ క్లోజ్ అవగా, కొద్దిరోజుల క్రితమే మళ్లీ ఓపెన్ అయ్యాయి. అన్ని రకాల ఫ్లేవర్స్ తో ఐస్ క్రీమ్ పార్లర్స్ టేక్ అవే మెయింటేన్ చేస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్ కి స్కూప్స్ వంటి పార్లర్స్ ఆర్డర్లని బట్టి ట్రక్కుల్లో సప్లయ్ చేస్తున్నాయి. ఐస్ క్రీమ్స్ తోపాటు థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, లస్సీ వంటివి కూడా డోర్ డెలివరీ చేస్తున్నాయి.

డోర్​ డెలివరీ కూడా..

లాక్​డౌన్ సడలింపులతో టేక్ అవే స్టార్ట్ చేసినం. డైలీ 70‌‌–80 మంది వరకు కస్టమర్లు వస్తున్నరు. ఒకే ఏరియాలో ఎక్కువ ఆర్డర్స్ ఉంటే డోర్ డెలివరీ చేస్తున్నం. మా సంస్థకి చెందిన స్కూప్స్ ద్వారా గేటెడ్ కమ్యూనిటీస్ కి ఐస్ క్రీమ్స్ ట్రక్స్ తీసుకెళ్తున్నం.

– ఫ్రాంక్లిన్, క్రీమ్ స్టోన్స్ మేనేజర్

హలీమ్​కు ఉన్న క్రేజ్​తో..

సిటిజన్స్​లో హలీమ్​​పై ఉన్న క్రేజ్​ని దృష్టిలో పెట్టుకుని ఆదాబ్ ఎక్స్​ప్రెస్, స్పైస్ సిక్స్ గ్లోబల్, ఓరిస్, పెషావర్ లాంటి రెస్టారెంట్లు టేక్ అవే అందించేందుకు ముందుకొచ్చాయి. గవర్నమెంట్ రూల్స్ మేరకు హలీమ్ తయారీకి పర్మిషన్ తీసుకున్నాయి. తక్కువ మొత్తంలో తయారుచేసి కస్టమర్లకు అందిస్తున్నాయి. హలీమ్​ అమ్ముతున్నట్లు పోస్టర్స్, ఇన్​స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ యాప్స్​లో తమ రెస్టారెంట్ పేజ్​తో ప్రమోట్ చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకే హలీమ్ అమ్ముతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

లిమిటెడ్ ఆర్డర్స్ తీసుకుంటున్నం

40 ఏండ్లుగా హలీమ్ సేల్ చేస్తున్నం. టేక్ అవేతో హలీమ్ మేకింగ్ కి పర్మిషన్ ఉండడంతో తక్కువ మందితో స్టార్ట్ చేసినం. మా హోటల్ నంబర్స్ ఆన్ లైన్ లో పెట్టినం. జనం గూమిగూడకుండా తక్కువ ఆర్డర్స్ తీసుకుంటున్నం. ఆర్డర్ రెడీ అయ్యాక కస్టమర్ కి కాల్ చేసి పిలిచి వెహికల్ దగ్గరకు తీసుకెళ్లి ఇస్తున్నం.

–మహిశ్ ఖాన్, ఆదాబ్ ఎక్స్ ప్రెస్ హోటల్

ఆస్పత్రులకు కరోనా సెగ..ఫీజులు పెంచిన డాక్టర్లు