కరీంనగర్  ప్రజావాణిలో సివిల్ కాంట్రాక్టర్ ఆందోళన

కరీంనగర్  ప్రజావాణిలో సివిల్ కాంట్రాక్టర్ ఆందోళన

కరీంనగర్, వెలుగు: వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా కరీంనగర్ సిటీ పరిధిలోని కొత్తపల్లి, చింతకుంట, మానకొండూరులో ఏర్పాటు చేసిన బారికేడ్లకు బిల్లులు ఇవ్వడం లేదని సివిల్ కాంట్రాక్టర్ గూడూరు నరసయ్య సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌‌లోని ప్రజావాణిలో నిరసన తెలిపాడు.

ఐదేళ్లుగా తానే ఈ ఏర్పాట్లు చేస్తున్నానని, కానీ ఆఫీసర్లు మాత్రం బిల్లులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి రాగా కలెక్టరేట్ ఏఓ సుధాకర్ తనను అడ్డుకున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టులు చేసుకునే తనకు ఐదేళ్ల నుంచి రావాల్సిన బిల్లు ఇప్పించాలని కోరారు. దీంతో పోలీసులు ఆయనను బయటికి తీసుకొచ్చారు.