ఒక్కరోజే 2.42 లక్షల గ్యాస్ సిలిండర్ల సరఫరా : పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

ఒక్కరోజే 2.42 లక్షల గ్యాస్ సిలిండర్ల సరఫరా : పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
  • .పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పౌర సరఫరాల శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. శనివారం ఒక్కరోజే కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,42,371 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసినట్టు ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్, హెచ్‌‌‌‌పీసీఎల్, బీపీసీఎల్‌‌‌‌ల ద్వారా ఈ  సరఫరా జరిగిందని చెప్పారు. ఐఓసీఎల్ 93,826 సిలిండర్లు, హెచ్‌‌‌‌పీసీఎల్ 79,974 సిలిండర్లు, బీపీసీఎల్ 68,571సిలిండర్లు ఇలా మొత్తంగా 2,42,371 సిలిండర్లు సరఫరా చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల లభ్యత, పంపిణీ తీరును కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతిరోజూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడకుండా, వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందుతాయని ఆయన వివరించారు.