డాల‌ర్ శేషాద్రి పార్థివ దేహానికి CJI ఎన్వీర‌మ‌ణ నివాళులు

డాల‌ర్ శేషాద్రి పార్థివ దేహానికి CJI ఎన్వీర‌మ‌ణ నివాళులు

సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ .. తిరుప‌తిలో డాల‌ర్ శేషాద్రి పార్థివ దేహానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా శేషాద్రి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. డాల‌ర్ శేషాద్రి లేర‌న్నది న‌మ్మ‌లేక‌పోతున్నార‌న్నారు. శేషాద్రితో 25ఏళ్ల అనుబంధం ఉంద‌ని తెలిపారు. శేషాద్రి మరణం నాకు వ్య‌క్తిగ‌తంగా తీర‌ని లోట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 43 ఏళ్లుగా శ్రీవారి సేవ‌లో త‌రిస్తూ ఆరోగ్యాన్ని కూడా విస్మ‌రించార‌ని అన్నారు. శేషాద్రి ర‌చించిన పుస్త‌కాల‌ను టీటీడీ ముద్రించి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని చెప్పారు

శేషాద్రి పార్థివ దేహాన్ని వారి కుటుంబ సభ్యులు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటిక కు తరలించి అంత్య క్రియలు నిర్వహించనున్నారు.