పురుషుల క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా బార్ కౌన్సిళ్లు..మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

పురుషుల క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా బార్ కౌన్సిళ్లు..మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

న్యూఢిల్లీ: బార్ కౌన్సిళ్లు పురుషుల క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా మారాయని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. పురుషుల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయాల ని.. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. ప్రతి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఇద్దరు మహిళా సభ్యులను కో-ఆప్ట్ చేసుకోవాలని ఆయన ఆదేశించారు. 

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అవకతవకలు, ఓటింగ్ పద్ధతులు, మహిళా సభ్యుల కో-ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్​ మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. బార్ కౌన్సిళ్లు పురుషుల గుత్తాధిపత్యంగా మారాయని, ఈ పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల వివాదాలను పర్యవేక్షించేందుకు జస్టిస్ సుధాన్షు ధూలియా నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీకి ఈ వ్యవహారాన్ని బదిలీ చేశారు. 

దీనిపై బెంచ్​ స్పందిస్తూ.. ప్రతి రాష్ట్ర బార్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇద్దరు మహిళా సభ్యులను కో-ఆప్టెడ్ పద్ధతిలో నామినేట్ చేయాలని ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. వారిలో ఒకరు మాజీ హైకోర్టు న్యాయమూర్తి కాగా, మరొకరు బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి పేరున్న సీనియర్ మహిళా న్యాయవాది అయి ఉండాలని  స్పష్టం చేసింది.