ఢిల్లీలో పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్ ప్రధానిమోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జ్ణానేష్ కుమార్ కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నించారు. వారణాసిలో మోదీ మొదట వెనుకబడి, ఆ తర్వాత ఆధిక్యంలోకి రావడం సహా 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జ్ణానేష్ కుమార్‌ను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని కూడా ఆరోపించారు. సీజేపీ నిరసన సమయంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసులను ఎందుకు మోహరించాల్సి అవసరమేంటని నిలదీశారు.
ఢిల్లీ నిరసనల్లో తమను అరెస్ట్ చేసిన తీరుపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరద్ దాస్ మండిపడ్డారు. అరెస్ట్ సందర్భంగా మాఫోన్లను స్వాధీనంచేసుకున్నారు కానీ మెమో ఇవ్వకపోవడంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. గతంలో ఇతర కార్యకర్తలకు జరిగినట్లే, సాక్ష్యంగా సమర్పించేందుకు డాక్యుమెంట్లుకోసం వారు మా పరికరాలను హ్యాక్ చేసి ఉండవచ్చని అనుమానించారు. ఖచ్చతంగా మా ఫోన్లు హ్యాక్ చేసి ఉండొచ్చని సౌరవ్ దాస్ అన్నారు.
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిన్న నిరసనల్లో అరెస్ట్ అయిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేతోపాటు, ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అరెస్ట్ కాగా ఇవాళ కోర్టు ఆదేశాలతో విడుదల చేశారు. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీజీపీ నేతలు అరెస్ట్ సందర్భంగా ఎదురైన అనుభవాలను మీడియాకు వివరించారు.
పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు..- సీజేపీ అశుతోష్ రాంకా
సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే అమ్మమ్మ మరణవార్త సందర్భంగా ఢిల్లీ పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారనిసీజేపీ ప్రతినిధి అశుతోష రంకా విమర్శించారు. దీప్కేకు తన అమ్మమ్మ మరణవార్త తెలిపినపుడు కూడా ఢిల్లీ పోలీసులు కెమెరాలు, మైక్రోఫోన్లతో అక్కడి నిలబడి ఉన్నారని,ఈ ఘటనను కూడా ఓ ప్రదర్శనగా మార్చడానికి ప్రయత్నించారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ భయపడుతోంది: సీజేపీ ప్రతినిధి రత్నాసింగ్
కాక్రోచ్ లను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే సీజేపీ వాలంటీర్ల కుటుంబాలను బెదిరింపులకు గురి చేస్తు్న్నారని సీజేపీ న్యాయ వ్యవహారాల ప్రతినిధి రత్నాసింగ్ విమర్శించారు. సీజేపీ తల్లిదండ్రులతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వాలంటీర్ల కదలికలను గమనిస్తున్నారని ఆమె ఆరోపించారు.
మోదీ షాలకోసమే పోలీస్ వ్యవస్త..
పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలం, అవినీతిమయమైందన్నారు సీజేపీ నేతలు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలకు కోసం మాత్రమే పనిచేస్తుందని విమర్శించారు. ఆందోళనకు మద్దతు ఇస్తున్న విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలకు కృతజ్ణతలు తెలిపారు. సీఈసీ రాజనీమా చేసే వరకుఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. నిరసనకారులు నిర్బంధం, హింసను ఎదుర్కొంటూనే ఉన్నారని, ఇందులో భాగంగానే ఓ ఎస్ఎఫ్ఐ విద్యార్థిపై దాడి జరిగిందని కూడా ఆరోపించారు.
#WATCH | Delhi: Cockroach Janta Party (CJP) Chief Spokesperson Saurav Das says, "They seized our phones but did not provide a seizure memo... We suspect our phones were hacked or cloned. Just as has happened to other activists over the years, we fear they may have hacked into our devices to plant documents or other material to be presented later as evidence... We want to state here that our phones have likely been compromised..."
— ANI (@ANI) October 11, 2026
