రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి మోదీజీ: ప్రధానిపై అభిజీత్ దీప్కే విమర్శలు

రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి మోదీజీ: ప్రధానిపై అభిజీత్ దీప్కే విమర్శలు

ప్రధాని మోదీపై కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీనామా చేసి ఇన్ ఫ్లుయెన్సర్ గా మారితే బెటర్ అంటూ విమర్శలకు దిగారు. ఒకవైపు దేశ వ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఉద్యమం జరుగుతుంటే.. విద్యార్థులను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు దీప్కే. ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ పూర్తయ్యాక.. సొంత ఊరికి చేరుకున్న దీప్కే.. గురువారం (జులై 30) ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశంలో విద్యా విధానం, రాజకీయ వ్యవస్థ మొదలైన అంశాలపై మాట్లాడారు. 

బీజేపీ కార్యకర్తల నుంచి బెదిరింపులు:

బీజేపీలో చేరిపో.. లేదంటే నీ అంతు చూస్తాం.. నీ ఫ్యామిలీని వదలం.. అంటూ బెదిరింపులు వస్తున్నట్లు ఆరోపణలు చేశారు.  పేపర్ లీక్స్ వ్యవహారంపై సీజేపీ తలపెట్టిన ప్రొటెస్టు సందర్భంగా తనకు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. 

ప్రధాని, హోమ్ మినిస్టర్ర స్థాయిలో ఉన్న వ్యక్తులు తన లాంటి ఒక స్టూడెంట్ ను టార్గెట్ చేయడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు యువకులను భయపెట్టాలని చూడటమేంటో అర్ధం కాలేదని అన్నారు. 

విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలకు సమాధానం చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, విద్యాహక్కు కోసం పోరాడటం ఈ దేశంలో తప్పు అయిపోయిందని అన్నారు.  

►ALSO READ | ఆయుర్వేదం నుంచి ఇన్సూరెన్స్ వరకు.. ప్రముఖ కంపెనీలో వాటా కొనుగోలు చేసిన పతంజలి

విద్యార్థులను అణచి వేసేందుకు బెల్ట్ గన్స్, ఏకే-47 ఉపయోగించారని ఆరోపించారు. అత్యంత క్రూరంగా పోలీసులు, బలగాలు వ్యవహరించాయని.. ఈ దాడుల్లో ఎంతో మంది విద్యా్ర్థులు తీవ్రంగా గాయపడగా.. కొందరు చూపు కోల్పోయినట్లు చెప్పారు. టెర్రరిస్టులపై వినియోగించే ఆయుధాలు విద్యార్థులపై వాడటం దారుణమన్నారు. 

భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఆందోళనల తర్వాత కూడా విద్యార్థులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తూ ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని ఆరోపించారు.