క్లారిటీ వచ్చింది

క్లారిటీ వచ్చింది

కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్‌‌కి బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి సెట్స్​కి వెళ్లనుంది. ఈలోపు తన నెక్స్ట్‌‌ ప్రాజెక్ట్స్‌‌పై దృష్టి పెట్టారు చిరంజీవి. ‘ఆచార్య’ తర్వాత మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్‌‌లో నటించనున్నారు చిరు. దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తాడని మొదట అన్నారు. కానీ తర్వాత అనుకోకుండా వినాయక్ పేరు తెరమీదికి వచ్చింది. ఇద్దరిలో ఎవరి చేతికి పగ్గాలు వెళ్తాయనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోపక్క మెహర్‌‌‌‌ రమేష్‌‌తో కూడా మెగాస్టార్‌‌‌‌కి కమిట్‌‌మెంట్ ఉందని తెలిసింది. కానీ అది కన్‌‌ఫర్మ్ అయ్యిందా లేదా అనే డైలమా కూడా ఉంది. కంత్రి, బిల్లా, శక్తి, షాడో లాంటి భారీ బడ్జెట్‌‌ చిత్రాలు చేసినా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాడు మెహర్. అందుకే చాలాకాలం పాటు మెగాఫోన్ పట్టకుండా ఉండిపోయాడు. ఆయనకి చిరు చాన్స్‌‌ ఇచ్చివుంటారా అనేదే అందరి డౌట్. ఆ డౌట్‌‌ని పవన్‌‌ కళ్యాణ్‌‌ చేసిన ఒకే ఒక్క ట్వీట్ పటాపంచలు చేసింది. పీకే బర్త్‌‌డేకి సోషల్‌‌ మీడియాలో విషెస్ చెప్పాడు మెహర్‌‌‌‌. దానికి పవన్ థ్యాంక్స్‌‌ చెప్పడమే కాక, చిరంజీవితో చేయబోతున్న సినిమా విషయంలో ఆల్‌‌ ద బెస్ట్ కూడా చెప్పాడు. దాంతో మెగాస్టార్‌‌‌‌తో మెహర్‌‌‌‌ సినిమా ఖాయమేనని తేలిపోయింది. అయితే వీరి కాంబినేషన్‌‌లో వచ్చే సినిమా ‘వేదాలం’ రీమేక్‌‌ అనే టాక్‌‌ కూడా ఇండస్ట్రీలో ఉంది. అజిత్‌‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట మంచి విజయం సాధించింది. ఇది పవన్‌‌ కళ్యాణ్‌‌ హీరోగా రీమేక్ కానుందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. కానీ ఇప్పుడు చిరు ఆ స్టోరీని ఓకే చేశారని అంటున్నారు. మరి మెహర్‌‌‌‌ నిజంగా రీమేక్‌‌ కోసమే చిరంజీవిని ఒప్పించాడో లేక ఇంకేదైనా సబ్జెక్ట్ ప్లాన్ చేశాడో మరి.