కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. టీఆర్ఎస్ కు చెందిన ఎంపీపీ మల్లారెడ్డిపై అదే పార్టీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను సమావేశాలకు పిలవడం లేదంటూ ఎజెండా పత్రాలను చింపివేశారు. ఎమ్మెల్యేను సమావేశాలకు పిలవకపోవడంతో గ్రామాల్లోని సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు. PACS చైర్మన్ ఆల్వాల కోటి… ఎంపీపీకి బదులు సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశాన్ని బాయ్ కాట్ చేసి, ఎంపీపీ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఎమ్మెల్యే బాలకిషన్ దయతో గెలిచిన ఎంపీపీ మల్లారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నేతలు.
see more news
