పొలిటికల్ డ్రామాగా పెద కాపు1.. రూటు మార్చిన క్లాస్ డైరెక్టర్

పొలిటికల్ డ్రామాగా పెద కాపు1.. రూటు మార్చిన క్లాస్ డైరెక్టర్

నారప్ప వంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీకీ "పెద కాపు1(peda kapu1)" అనే టైటిల్ ను ఫిక్స్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అఖండ(Akhanda) మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీతో కొత్త హీరో విరాట్ కర్ణ(Virat karna) ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. అందుకే పోస్టర్ లో “పెద కాపు 1” అని మెన్షన్ చేశారు. 

ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పోస్టర్ అండ్ టైటిల్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా పొలిటికల్ డ్రామాగా రానుందని అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనుండగా మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.