రికార్డ్ క్రియేట్ చేసిన మహ్మద్ షమీ

రికార్డ్ క్రియేట్ చేసిన మహ్మద్ షమీ

సీనియర్‌‌‌‌‌‌‌‌ పేసర్ మహ్మద్‌‌‌‌‌‌‌‌ షమీ (5/44)  ఖతర్నాక్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో  సౌతాఫ్రికాతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్టును టీమిండియా తన కంట్రోల్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చుకుంది.   మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌  మంచిగా ఆడకపోవడంతో 55 రన్స్‌‌‌‌‌‌‌‌కే  చివరి 7 వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన తర్వాత  బాల్‌‌‌‌‌‌‌‌తో సూపర్‌‌‌‌‌‌‌‌ షో చూపెట్టింది. మొత్తంగా 18 వికెట్లు పడ్డ మూడో రోజు, మంగళవారం  ఆటలో  ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఇండియా హవా నడిచింది.  ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాను 197కే ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేసింది.  టెంబా బవూమ (52), క్వింటన్‌‌‌‌‌‌‌‌ డికాక్‌‌‌‌‌‌‌‌ (34)తో పాటు చివర్లో రబాడ (25) ఫైటింగ్‌‌‌‌‌‌‌‌తో హోస్ట్‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌ 200 మార్కు దాటింది. షమీతో పాటు బుమ్రా (2/16) శార్దూల్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ (2/51), మహ్మద్​ సిరాజ్‌‌‌‌‌‌‌‌ (1/45) రాణించారు. అనంతరం 130 రన్స్​ లీడ్‌‌‌‌‌‌‌‌తో సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఇండియా డే చివరకు 16/1  స్కోరుతో నిలిచింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్​ (4) ఔటవగా.. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (5 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), శార్దూల్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంకో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్​లో ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా కోహ్లీసేన146  రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌తో ఉంది.  అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరు 272/3తో ఆట కంటిన్యూ చేసిన ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 327కే ఆలౌటైంది. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు కేఎల్​ రాహుల్‌‌‌‌‌‌‌‌ (123), రహానె (48) తొందరగానే పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరగా.. లోయర్‌‌‌‌‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ కంప్లీట్‌‌‌‌‌‌‌‌గా ఫెయిలైంది. రిషబ్​  పంత్ (8), అశ్విన్‌‌‌‌‌‌‌‌ (4) సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్స్‌‌‌‌‌‌‌‌కే ఔటయ్యారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి (6/71) ఆరు వికెట్లు పడగొట్టగా.. రబాడ (3/72 ) ముగ్గురిని ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. నాలుగో రోజు బాగా ఆడి సౌతాఫ్రికాకు పెద్ద టార్గెట్​ ఇస్తే ఇండియా గెలవడం ఖాయమే అనొచ్చు.

55 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఏడు వికెట్లు
ఫస్ట్‌‌‌‌‌‌‌‌ డే మొత్తం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసి భారీ స్కోరుపై గురి పెట్టిన ఇండియా స్పీడుకు సౌతాఫ్రికా బౌలర్లు బ్రేక్‌‌‌‌‌‌‌‌ వేశారు. వానతో రెండో రోజు ఆట క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ అవగా.. మూడో రోజు మార్నింగ్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లో ఎంగిడి, రబాడ హవా నడిచింది. ఎక్కువ బౌన్స్‌‌‌‌‌‌‌‌పై వస్తున్న పిచ్‌‌‌‌‌‌‌‌పై  ఫుల్ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌తో ఈ ఇద్దరూ ఇండియన్స్‌‌‌‌‌‌‌‌కు పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో  రబాడ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అందించాడు. తన రిబ్స్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ రబాడ వేసిన షార్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను సరిగ్గా పుల్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయిన రాహుల్‌‌‌‌‌‌‌‌.. కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌తో ఫిఫ్టీకి దగ్గరైన రహానెను ఎంగిడి గుడ్‌‌‌‌‌‌‌‌లెంగ్త్ బాల్‌‌‌‌‌‌‌‌తో కాట్‌‌‌‌‌‌‌‌ బిహైండ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇక, పేస్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌లపై బాగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోతున్న అశ్విన్.. రబాడ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఔటయ్యాడు. పంత్‌‌‌‌‌‌‌‌ కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఎంగిడి వేసిన యాంగులర్‌‌‌‌‌‌‌‌ డెలివరీ అతని బ్యాట్‌‌‌‌‌‌‌‌, ప్యాడ్‌‌‌‌‌‌‌‌కు తగిలి షార్ట్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌లో డుసెన్‌‌‌‌‌‌‌‌ చేతిలో పడింది. శార్దూల్‌‌‌‌‌‌‌‌ (4), షమీ (8) కూడా సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కు పరిమితమైనా.. చివర్లో  బుమ్రా (14) కొద్దిసేపు ఫైట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. జాన్సెన్‌‌‌‌‌‌‌‌ (1/69) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో లాస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌గా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరడంతో లంచ్‌‌‌‌‌‌‌‌కు ముందే ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. 

షమీ సూపర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌
టీమిండియా భారీ స్కోరు చేయలేకపోయిందని ఫీలవుతున్న ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు బౌలర్లు కిక్ ఇచ్చారు. ఓ వైపు షమీ... మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో బుమ్రా, శార్దూల్‌‌‌‌‌‌‌‌ బుల్లెట్లలాంటి బాల్స్‌‌‌‌‌‌‌‌తో సౌతాఫ్రికా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ను పడగొట్టారు.  ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డీన్‌‌‌‌‌‌‌‌ ఎల్గర్‌‌‌‌‌‌‌‌ (1)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన బుమ్రా ఇండియాకు  బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. కానీ, ఆరో ఓవర్లో ఐదో బాల్‌‌‌‌‌‌‌‌ వేసినప్పుడు కుడి కాలు మడమ బెణకడంతో బుమ్రా ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకు వెళ్లాడు.  21/1 స్కోరుతో లంచ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లొచ్చిన సౌతాఫ్రికాను షమీ దెబ్బకొట్టాడు. బ్రేక్‌‌‌‌‌‌‌‌ తర్వాత థర్డ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కే  కీగన్‌‌‌‌‌‌‌‌ పీటర్సన్‌‌‌‌‌‌‌‌ (15)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన తను ఓ సూపర్‌‌‌‌‌‌‌‌ డెలివరీతో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (13)ను బౌల్డ్​ చేశాడు. . తర్వాతి ఓవర్లోనే   డుసెన్ (3)ను సిరాజ్‌‌‌‌‌‌‌‌ వెనక్కుపంపడంతో 32/4తో నిలిచిన సౌతాఫ్రికా వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో బవూమ, క్వింటన్‌‌‌‌‌‌‌‌ డికాక్‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 72 రన్స్‌‌‌‌‌‌‌‌ యాడ్‌‌‌‌‌‌‌‌ చేసి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ,  టీకి ముందు డికాక్‌‌‌‌‌‌‌‌ను శార్దూల్‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో 104కే సౌతాఫ్రికా సగం వికెట్లు కోల్పోయింది. థర్డ్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ మన బౌలర్ల హవా నడిచింది. వెంటవెంటనే ముల్డర్‌‌‌‌‌‌‌‌ (12), బవూమను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన షమీ ఫైవ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. అయితే, చివర్లో  రబాడ (25), జాన్సెన్‌‌‌‌‌‌‌‌ (19), కేశవ్‌‌‌‌‌‌‌‌ (12) పోరాడారు. టీమ్‌‌‌‌‌‌‌‌ను 200 మార్కు వరకు తీసుకెళ్లారు. అయితే,  మళ్లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన బుమ్రా.. కేశవ్‌‌‌‌‌‌‌‌ను లాస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌గా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. దాంతో, ఇంగ్లండ్​ ఇన్నింగ్స్​ ముగించింది. 

పంత్‌‌‌‌‌‌‌‌ ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌ 100, షమీ 200
టెస్టుల్లో ఫాస్ట్‌‌‌‌‌‌‌‌గా 100 డిస్మిసల్స్‌‌‌‌‌‌‌‌ చేసిన (క్యాచ్‌‌‌‌‌‌‌‌, స్టంపౌట్‌‌‌‌‌‌‌‌, రనౌట్‌‌‌‌‌‌‌‌)  ఇండియా వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌గా ఎంస్‌‌‌‌‌‌‌‌ ధోనీ రికార్డును పంత్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ధోనీ 36 టెస్టుల్లో ఈ మార్కు చేరగా.. పంత్‌‌‌‌‌‌‌‌కు కేవలం 26 టెస్టులే అవసరం అయ్యాయి. మరోవైపు ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో తక్కువ బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే  వేగంగా 200 వికెట్లు పడగొట్టిన ఇండియా బౌలర్‌‌‌‌‌‌‌‌గా షమీ రికార్డు క్రియేట్‌‌‌‌‌‌‌‌ శాడు. 9896 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే షమీ ఈ ఘనత సాధించి అశ్విన్‌‌‌‌‌‌‌‌ను (10248 బాల్స్‌‌‌‌‌‌‌‌)ను వెనక్కునెట్టాడు. 

ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 105.3 ఓవర్లలో 327 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ 123, మయాంక్‌‌‌‌‌‌‌‌ 60, రహానె 48, ఎంగిడి 6/71, రబాడ 3/72).
సౌతాఫ్రికా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌:  62.3 ఓవర్లలో 197 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (బవూమ 52, డికాక్‌‌‌‌‌‌‌‌ 34, షమీ 5/44, బుమ్రా 2/16).
ఇండియా సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 6 ఓవర్లలో 16/1 (లోకేశ్‌‌‌‌‌‌‌‌ 5 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, శార్దూల్‌‌‌‌‌‌‌‌ 4 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, జాన్సెన్‌‌‌‌‌‌‌‌ 1/4).