భారం తప్ప భద్రత లేదు..చాకిరి చేస్తున్నా నో లీవ్స్

భారం తప్ప భద్రత లేదు..చాకిరి చేస్తున్నా నో లీవ్స్

హాస్పిటల్ లో పేషేంట్ అడ్మిట్ అయింది మొదలు వారికి కావాల్సిన అనేక రకాల సేవలందించేది పేషేంట్ కేర్, క్లీనింగ్ స్టాఫ్. బెడ్ షీట్స్ మార్చడం మొదలు.. వార్డులు ఖాలీ చేయడం దాకా అన్నీ వాళ్లే చూసుకుంటారు. సిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 3వేల మంది క్లీనింగ్, పేషెంట్ కేర్ స్టాఫ్ ఉండగా.. ఇప్పుడు కరోనా భయంతో దాదాపుసగం మంది డ్యూటీలకు రావడం లేదు. దాంతో ఉన్నవారిపైనే అదనపు పని భారం పడుతోంది. మరోవైపు కరోనా వార్డుల్లో పనిచేసే వర్కర్లు కరోనా బారినపడడం, కొన్ని హాస్పిటల్స్ లో పీపీఈ కిట్లు,మాస్క్ లు కూడా ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

భయంతో డ్యూటీలకు రావట్లే

గాంధీ, నిలోఫర్, ఉస్మానియా, పేట్లబురుజు, సరోజిని, చెస్ట్, కోఠి మెటర్నిటీ, మలక్ పేట్ హాస్పిటల్స్తో పాటు సిటీ పరిధిలోని పీహెచ్సీల్లో కాంట్రాక్ట్పై క్లీనిం గ్, పేషెంట్ కేర్ స్టాఫ్ పనిచేస్తున్నారు. వార్డ్బాయ్స్, ఆయాలు, వాష్ రూమ్ క్లీనింగ్, శానిటైజ్ సిబ్బంది, అటెండర్స్ ఇలా తమకు కేటాయించిన పనులు చేస్తుంటారు. జీతం నెలకి రూ.9,500, కటింగ్స్ పోను రూ.8,400 వస్తుంది. ఇప్పటికే 50 మందికిపైగా వర్కర్లు కరోనా బారినపడగా, మిగిలిన వాళలోనూ చాలామంది డ్యూటీలకు రావడం లేదు. ఉస్మానియాలో 200కి గాను 100మంది, గాంధీలో 200కి 150, నిలోఫర్లో 300కి 150, ఫీవర్ హాస్పిటల్ లో 70కి 50, కోఠిమెటర్నిటీలో 100కి 70 మంది సిబ్బంది మాత్రమే వస్తున్నారు.

ఒక్కరోజు రాకుంటే..

కరోనా కష్టకాలంలో సేవలందిస్తున్నా క్లీనింగ్, పేషెంట్ కేర్ వర్కర్స్గోడు పట్టించుకునే వారులేరు. చాలా హాస్పిటల్స్లో మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదు. వీటిపై ఇటీవల నిలోఫర్ స్టాఫ్ఆందోళన చేయగా మేనేజ్మెంట్ కొద్దిమందికి అందించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కూడా లేకపోవడంతో వచ్చే కొద్దిపాటి జీతం కూడా ప్రైవేట్ వెహికల్స్ చార్లకే సరిపో జీ తోందని పలువురు కార్మికులు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇస్తానన్న10 శాతం ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.ఒక్కరోజు డ్యూటీకి రాకపోతే రెండ్రోజుల జీతం కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం డ్యూటీచేస్తే.. మరో వారం హోంక్వారంటెయిన్ లీవ్ ఇవ్వాల్సి ఉండగా, మూడ్రోజులే ఇస్తున్నట్లు చెప్పారు. శానిటైజేషన్ సిబ్బంది, సెక్యూరిటీకి వీక్లీ ఆఫ్ మినహా సెలవులు అసలే ఇస్తలేదు.

ఇన్సెంటివ్ ఇయ్యాలె

22 ఏండ్ల నుంచి ఆయాగా చేస్తున్నా. కరోనా కారణంగా డ్యూటీకి రావాలంటే భయంగా ఉంటోంది. డైలీ 300 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని డీఎంఏ చెప్పినా, రూపాయి కూడా ఇయ్యలేదు. నిలోఫర్ లో300 మంది వర్కర్స్ ఉంటే సగం మంది రాట్లేదు. పీపీఈ కిట్స్ ఇవ్వట్లేదని ధర్నా చేస్తే ప్రొవైడ్ చేశారు. కొన్ని హాస్పిటల్స్సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.‑ హసీనా బేగం, ఆయా, నిమ్స