నారపల్లిలో అనాథ పిల్లలకు బట్టలు పంపిణీ

నారపల్లిలో అనాథ పిల్లలకు బట్టలు పంపిణీ

హైదరాబాద్, వెలుగు: శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. సోమవారం ఘట్​కేసర్​పరిధి నారపల్లిలోని ఫ్రెండ్స్ ఫౌండేషన్ కు వెళ్లి అక్కడి పిల్లలకు బట్టలు అందజేశారు. పిల్లల లక్ష్యాలు, లైఫ్ గోల్స్ ఏమిటో కనుక్కుని అవి సాధించడానికి ఏమి చేయాలో వివరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు బ్రెయిన్ స్ట్రోమింగ్ గేమ్స్ కండక్ట్ చేయగా ప్రతిభ చూపారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. శ్రేష్ఠ ఫౌండేషన్ ఫౌండర్, సీఈఓ కంకణాల ఎఫ్రాయిము మాట్లాడుతూ.. చిన్నారుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, చేయూతనిస్తే గొప్పగా ఎదుగుతారని చెప్పారు. ఫ్రెండ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ రంజిత్ కుమార్, కేర్ టేకర్ ఆంజనేయులు, ఫ్రెండ్స్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.