హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ డీజీపీ హెచ్‌జే దొర కుటుంబసభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని కావూరి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధిగా కావూరి సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియా డారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం కావూరి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికెళ్లిన సీఎం.. దొర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ విభాగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో దొర చేసిన కృషిని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ గల అధికారిగా ఆయన చూపిన చొరవ నేటికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.
