అదే జోష్తో మళ్లీ సీఎం కప్ కొట్టాలి: కలెక్టర్ హరిచందన

అదే జోష్తో మళ్లీ సీఎం కప్ కొట్టాలి: కలెక్టర్ హరిచందన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్​లో హైదరాబాద్ జిల్లా స్థాయి సీఎం కప్​– 2025 క్రీడా పోటీలను కలెక్టర్ హరిచందన దాసరి సోమవారం ప్రారంభించారు. గత రెండు ఎడిషన్లలో హైదరాబాద్ అత్యుత్తమ ప్రతిభతో విజయం సాధించిందని గుర్తు చేస్తూ, ఈసారి కూడా అదే ఉత్సాహం, నిబద్ధతతో పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో విజయం సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 

ఈ నెల 9 నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్​తో పాటు వివిధ మైదానాల్లో జరిగే పోటీల్లో దాదాపు 10 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 16 మండలాల నుంచి 43 క్రీడల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. రోహిణి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధాకర్​ పాల్గొన్నారు.