
బీజేపీ పార్టీ చెత్తకుప్ప పార్టీ అని.. ఆ పార్టీకి ఒక్క ఓటు వేసినా చెప్పకుప్పలో వేసినట్లే అని.. వేస్ట్ అన్నారు సీఎం కేసీఆర్. నవంబర్ 16వ తేదీ ఆదిలాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. బీజేపీని ఏకిపారేశారు. మతతత్వ పార్టీ అని.. మతాల మధ్య చిచ్చు పెడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో మోదీ ఓడిపోతారని.. ప్రాంతీయ పార్టీలదే హవా అని.. మీ ఓటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారాయన. బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఢిల్లీలో సత్తా చూపిస్తామన్నారు కేసీఆర్.
also read :- కబ్జా భూములను ప్రభుత్వానికి అప్పగిస్తా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఇక కాంగ్రెస్ పార్టీపైనా విరుచుకుపడ్డారు కేసీఆర్. ధరణి తీసేస్తాం అంటున్నారని.. కరెంట్ మూడు గంటలే ఇస్తామని చెబుతున్నారని.. అలా అయితే రైతులు ఎలా బతికేది అని ప్రశ్నించారాయన. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలతో ఆగం కావొద్దని కోరారు కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తే రైతు బంధు 16 వేలు ఇస్తామని హామీ ఇచ్చారాయన. తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయని.. కరెంట్ తక్కువ ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారాయన.
ఆదిలాబాద్ జిల్లాలోని చనాతా కొర్టా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘతన మా ప్రభుత్వానిదే అన్నారాయన. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరితో చేయమంటే ఎలా అని.. ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి.. పనులు బీఆర్ఎస్ చేయమంటే ఎలా సాధ్యం అంటూ ప్రజలను ప్రశ్నించారు సీఎం కేసీఆర్.