
కేసీఆర్ కు రాజకీయాలు తప్ప ప్రజారోగ్యం పట్టదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు. కేసీఆర్ కు పాలన చేతకావట్లేదన్నారు కృష్ణ సాగర్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ తో 250 మందికిపైగా మరణించారని చెప్పారు. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు కృష్ణ సాగర్ రావు.
తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతోందని విమర్శించారు. 2019 మే నెలలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైరల్ ఫీవర్స్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ హెచ్చరికలను బేఖాతరు చేసిందన్నారు కృష్ణ సాగర్ రావు.