నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా సాగు నీరు అందడం లేదు…

నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా సాగు నీరు అందడం లేదు…

నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా సాగు నీరు అందడం లేదంటున్నారు నల్లగొండ జిల్లా తండావాసులు. నెల్లికల్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా అమలు కావడం లేదంటున్నారు. ఓట్ల కోసం వచ్చి మాటలు చెప్పిన నేతలు … ఇప్పుడు తమను పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోఏళ్లుగా ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నా… ఆచరణలో నిర్మాణం జరగడం లేదు. మాజీ మంత్రి జానారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కూడా ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినవారే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు బహిష్కరించాలని తండా వాసులు నిర్ణయించారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి … ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో లిఫ్ట్ ఏర్పాటు చేయిస్తానని చెప్పడంతో … తండావాసులు ఓట్లు వేశారు.

KCR హామీ నెరవేరలే…
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోముల నర్సింహయ్యను గెలిపిస్తే … తానే వచ్చి నెల్లికల్ ఎత్తిపోతల పథకానికి కొబ్బరికాయ కొడతానని చెప్పారు. దీంతో తండవాసుల్లో ఆశలు పెరిగాయి. ఇప్పుడు జిల్లామంత్రి, స్థానిక ఎమ్మెల్యే లిఫ్ట్ విషయాన్ని పట్టించుకోవడం లేదంటున్నారు జనం. నేతలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. లిఫ్ట్ ఏర్పాటయితే కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు స్థానికులు. నాగార్జున సాగర్ కు దగ్గరగా ఉన్నా… తమ భూములకు నీరు అందడం లేదంటున్నారు.