సీఎం కేసీఆర్కు వైరల్ ఫీవర్

సీఎం కేసీఆర్కు వైరల్ ఫీవర్

సీఎం కేసీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.  కేసీఆర్ కు  వైరల్ ఫీవర్ సోకిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 

గత వారం రోజులుగా సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇంట్లోనే ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.  వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ను నిత్యం పర్యవేక్షిస్తుందని చెప్పారు.  త్వరలోనే  సీఎం కోలుకుంటారని వైద్యులు వెల్లడించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.