రైతుల దగ్గరున్న వరి ధాన్యం కొనేయండి

రైతుల దగ్గరున్న వరి ధాన్యం కొనేయండి
  • జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ

హైదరాబాద్: ప్రభుత్వం వరిధాన్యం సేకరణ ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. వారి ఎదురు చూపులపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. రైతుల దగ్గర ఉన్న వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన సందర్బంగా వరి ధాన్యం పరిస్థితిపై సమీక్షించారు. ఈ యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, మిగిలిన కొద్దిపాటి ధాన్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.