రాష్ట్రంలో ‘అన్​లాక్’పై నేడు సీఎం రివ్యూ

రాష్ట్రంలో ‘అన్​లాక్’పై నేడు సీఎం రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులపై సీఎం కేసీఆర్  ఆదివారం ప్రగతిభవన్ లో  రివ్యూ చేయనున్నారు. కేంద్రం తాజాగా జారీ చేసిన గైడ్ లైన్స్ ను యధాతథంగా అమలు చేయనున్నారు. కంటెయిన్​మెంట్ జోన్లలో లాక్  డౌన్  కొనసాగిస్తూ.. మిగతా చోట్ల గుడులు, ప్రార్థన మందిరాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ కు అనుమతిచ్చే చాన్స్ ఉంది. హైదరాబాద్ లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో.. షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లపై మరికొంత కాలం నిషేధం విధించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చే చాన్స్​ ఉందని అధికారులు చెప్తున్నారు. సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. స్కూళ్లు, కాలేజీలను ఎప్పట్నుంచి తెరవాలన్న దానిపై సీఎం  కేసీఆర్  నిర్ణయం తీసుకోనున్నారు.

For More News..

ఇవి ఎడారి మిడతలు కావు.. పక్కా లోకల్..