గొర్లు, బర్లు కొనివ్వడం గొప్ప కాదు

గొర్లు, బర్లు కొనివ్వడం గొప్ప కాదు

సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామంలో పర్యటిస్తున్నారు. గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేసిన.. అనంతరం గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లారు. అక్కడ సర్పంచ్.. తమ గ్రామానికి కొన్ని ట్రాక్టర్లు ఇప్పించాలని కోరారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకొని గ్రామాభివృద్ధి గురించి మాట్లాడారు.

కాగా.. గ్రామానికి సర్పంచ్ ట్రాక్టర్లు కొనివ్వమని అడగడంపై స్పందించిన కేసీఆర్.. గొర్లు, బర్లు, ట్రాక్టర్లు కొనివ్వడం గొప్ప పనికాదని అన్నారు. సీఎం మీ చేతిలో ఉన్నాడని.. మీ ఊరి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన అన్నారు.