ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారింది

ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారింది

సిద్దిపేట జిల్లా:  ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారిందని తెలిపారు సీఎం కేసీఆర్‌. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రైతులకు ప్రపంచంలోనే ఎక్కడా లేని తీపి కబురు త్వరలోనే చెబుతానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు అతి పెద్దదని.. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అని తెలిపారు. 165 టీఎంసీల కెపాసిటీతో కొత్త రిజర్వాయర్లు నిర్మించామని.. ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఏ రాష్ట్రం కూడా నిర్మించలేదని తెలిపారు సీఎం.

మూడు నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేశామన్న కేసీఆర్.. లక్ష కోట్ల రూపాయాల పంటను తెలంగాణ రైతాంగం సంవత్సరానికి పండించబోతుందన్నారు. దేశంలో రాష్ట్రాలనుంచి 83 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే.. ఇందులో 53 లక్షలు తెలంగాణనే ఇచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని స్వయానా FCI ప్రకటించిందని తెలిపారు సీఎం కేసీఆర్.