ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్

లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు  ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. కాసేపటి క్రితమే ఉజ్జయిని మహంకాళి   అమ్మవారికి సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించారు.  అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్.. ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. భారీగా భక్తులు, వీఐపీల తాకిడితో ఆలయవం కిక్కిరిసిపోయింది.

ఇవాళ ఉదయం తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనంతో ప్రారంభమైన ఉత్సవాలు రేపు కూడా కొనసాగునున్నాయి.  ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, బోనం సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, సీఎస్​ శాంతి కుమారి అమ్మవారిని దర్శించుకున్నారు.