ప్రాణనష్టం జరగకుండా చూడండి.. మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశం

ప్రాణనష్టం జరగకుండా చూడండి..  మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వర దల కారణంగా ప్రాణనష్టం జరగకుండా చూడా లని కేసీఆర్ మంత్రులను కోరారు. అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలన్నారు. జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రులకు ఆయన ఫోన్లలో ఆదేశించారు. 

రక్షణ చర్యల కోసం సీఎస్ శాంతి కుమారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో సెక్రటేరియెట్​లో సీఎస్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్​లు నిర్వహించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎస్ బృందాలు, రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు సహా, ఫుడ్, వైద్యం తదితర రక్షణ సామాగ్రి, సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టారు.  

ALSO READ:శివారు ప్రాంతాల్లో ముంపు కష్టాలు

ముంపు తగ్గించే చర్యలు చేపట్టాలి

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంక లు ప్రమాద హెచ్చరికలు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ముంపు తగ్గించే చర్యలు చేపట్టాలని, ఇన్ ఫ్లో ను ముందుగా అంచనా వేసి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని చీఫ్ ఇంజనీర్లకు కేసీఆర్ ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు.