ఏడాదిలో నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయండి : కార్పొరేట్ ఆస్పత్రి డాక్టర్లకు సీఎం రేవంత్ పిలుపు

ఏడాదిలో నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయండి : కార్పొరేట్ ఆస్పత్రి డాక్టర్లకు సీఎం రేవంత్ పిలుపు

కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లకు కీలక  పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఏడాదిలో కనీసం నెలరోజులు అయినా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. తాను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుంచి పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించటమే ప్రాధాన్యతగా ముందుకెళ్తున్నామని అన్నారు. ఇందుకోసం కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు కూడా సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్.

రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరూ ఏడాదిలో ఒక్క నెలరోజులు  అయినా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని అన్నారు.11 నెలల పాటు ఎవరికి నచ్చిన చోట నచ్చినంత జీతం తీసుకొని పని చేసి.. సామజిక బాధ్యత కింద ఏడాదిలో ఒక్క నెల అయినా ఎక్కడో ఒకచోట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని కోరారు సీఎం రేవంత్. పేదల కోసం పనిచేసినప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుందని అన్నారు సీఎం రేవంత్.

►ALSO READ | ఫార్ములా ఈ కార్ రేసు కేసులో IAS అరవింద్ కుమార్‎కు మరోసారి ఏసీబీ నోటీసులు

ఇది కేవలం తెలంగాణలో, హైదరాబాద్ లో పనిచేస్తున్న డాక్టర్లకే కాదని.. అమెరికా లాంటి విదేశాల్లో చాలామంది మనవాళ్ళు వైద్య వృత్తిలో ఉన్నారని వాళ్ళు ఎదో ఒక పని మీద ఇండియాకి వచ్చినప్పుడు సేవ చేయాలి అనుకున్నా కుడా వాళ్లకు సరైన వేదిక లేదని అన్నారు. అలాంటి వేదిక ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించానని అన్నారు సీఎం రేవంత్.