
లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలు పెట్టాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కవితను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్,మోడీ కలిసి నాటాకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబం, బీజేపీ ఆడుతున్న డ్రామా నిరంతర సీరియల్ ను తలపిస్తుందన్నారు. నిన్న కవిత అరెస్ట్ తో డ్రామా పతాకస్థాయికి చేరిందన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి ఎన్నికలకు ముందు మోడీ ,కేసీఆర్ కలిసి వ్యూహాత్మకంగా వస్తున్నారని చెప్పారు.
ఎప్పుడైనా ఈడీ ముందొచ్చి..మోడీ వచ్చేవాడు కానీ.. ఈ సారి ఈడీ మోడీ ఇద్దరు ఒకేసారి వచ్చారన్నారు. కూతురు అరెస్ట్ అయితే కేసీఆర్ ఇంత వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ రాలేదంటే ఎలా అర్థం చేసుకోవాలన్నారు. ఒక శాసన మండలి సభ్యురాలిగా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు,వివరణ ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.