కేసీఆర్ కరెంట్ కొనుగోళ్లపై జుడీషియల్ విచారణ : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కరెంట్ కొనుగోళ్లపై జుడీషియల్ విచారణ : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కరెంట్  కొనుగోళ్లపై జుడీషియల్ విచారణకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూడు అంశాలపై  పూర్తి స్థాయిలో జుడీషియల్ ఎంక్వైరికీ ప్రభుత్వం సిద్దమని అసెంబ్లీలో ప్రకటించారు.

 జగదీశ్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నాం. విద్యుత్ శాఖలో స్కాంలపై విచారణ చేయిస్తామన్నారు రేవంత్.  చత్తీస్ ఘడ్ తో ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి పవర్  ప్రాజెక్టులపై జుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తామన్నారు.  ఆనాటి ప్రభుత్వం సభలో ఏనాడు వాస్తవాలు బయట పెట్టలేదన్నారు. చత్తీస్ ఘడ్ ఒప్పందం  తప్పని చెప్పిన ప్రభుత్వ ఉద్యోగిని గత ప్రభుత్వం వేధించిందన్నారు రేవంత్.  మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి  హోదాను తగ్గించిందని చెప్పారు.

చత్తీస్ ఘడ్ ఒప్పందపై తాము  ప్రశ్నిస్తే సభలో  మార్షల్ తో బయటకు గెంటించారని విమర్శించారు రేవంత్.  ఉద్యోగ శాఖను పూర్తిగా స్కానింగ్ చేసి పూర్తి వివరాలు బయటపెడ్తమాన్నారు.  కరెంట్ అనే సెంటిమెంట్ ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు  వాడుకుందని ఆరోపించారు.  మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు.