- ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్న సీఎం
- నిన్న రాత్రి గంట పాటు ప్రాక్టీస్
- తెలంగాణ స్పోర్ట్స్ స్పిరిట్‌ను హైలైట్ చేయడమే లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్పిరిట్ ను హైలెట్ చేయడమే లక్ష్యంగా సీంఎ రేవంత్ ముందుకు సాగుతున్నారు. స్వయంగా ఫుల్ బాల్ ఆటగాడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం చిక్కినప్పుడల్లా గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పరుగులు తీస్తూ గోల్స్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత ఏడాది మే 12న హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి ఫుట్ బాల్ ఆడారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూ లేకుండనే సీఎం ఫుట్ బాల్ ఆడారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ విద్యార్థులు తదితరులు సీఎంతో పాటు ఫుట్ బాల్ ఆడారు.
ఈ నెల 13న మెస్సీతో మ్యాచ్
ప్రపంచ స్టార్ ఫుడ్‌బాల్ ప్లేయర్.. లియోనెల్ మెస్సీ ఇండియా టూర్‌కు సిద్ధమయ్యారు. ఈ టూర్‌లో భాగంగా డిసెంబర్ 13న ఆయన హైదరాబాద్ రానున్నారు. అయితే హైదరాబాద్ రానున్న మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నారు. ఇందుకోసం నిన్న రాత్రి ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో గంటపాటు ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోజంతా కార్యక్రమాలు ముగించుకుని రాత్రి ఫుట్ బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్ లోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. యువతతో కలిసి ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. సుమారు గంటపాటు ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
