ఏఐ శకం ఇపుడే మొదలైంది.. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలి: సీఎం రేవంత్

ఏఐ శకం ఇపుడే మొదలైంది.. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలి: సీఎం రేవంత్

టెక్నాలజీ జీవితంలో భాగమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జరుగుతోన్న ఏఐ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన..  తెలంగాణలో పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన రేవంత్..ఏఐతో  ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఏఐలో ఇండియా గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోందన్నారు. ఏఐ శకం ఇపుడే మొదలైందన్న సీఎం..గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది.. ఇపుడు సాఫ్ట్ వేర్ విప్లవం నడుస్తోందన్నారు. భారతీయులు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతారని చెప్పారు.

 తెలంగాణలో ఏఐని ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. నేషనల్ ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు . వ్యవసాయంరంగానికి టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కొత్త విధానంతో మానవ జీవన విధానంలో కీలక మార్పులు జరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఆరు నెలలకోసారి ఏఐ సదస్సులు జరగాలన్నారు రేవంత్.