కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్దిని అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి..కేటీఆరేనని చెప్పారు రేవంత్. అభివృద్దిని అడ్డుకునే కేటీఆర్,కిషన్ రెడ్డి హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ అని అన్నారు. కిషన్ రెడ్డి, కేటీఆర్, హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్ ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి..కేసీఆర్,కేటీఆర్ లకు లొంగిపోయారని విమర్శించారు. హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే..అవి కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు. హైదరాబాద్ ప్రజలు 2004 నుంచి 2014, 2014 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలన్నారు.కేసీఆర్ హైదరాబాద్ కు తెచ్చిన గొప్ప వరాలు..గంజాయి..డ్రగ్స్ అని విమర్శించారు. కేటీఆర్ హైదరాబాద్ ను డ్రగ్స్ కు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. బీజేపీ,బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్ అభివృద్దిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు రేవంత్. భవిష్యత్ కోసం జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు రేవంత్.
మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్.. అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు ఓటెయ్యాలి . గత పదేండ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. హైదరబాద్ లో గత 20 ఏండ్లలో జరిగిన అభివృద్ధిని పోల్చి ఓటెయ్యండి. తెలంగాణ ఏర్పడినపుడు 16వేల కోట్ల మిగులు బడ్జెట్. పదేండ్లలో రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు. మేం మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే..కేసీఆర్ అప్పుల పాలు చేశారు. హైదరాబాద్ కు నల్సార్ వర్శిటీ, కృష్ణ జలాలు కాంగ్రెస్ ఘనతే. హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, మెట్రో, ఎయిర్ పోర్టు, కాంగ్రెస్ హయాంలోనివే . కాంగ్రెస్ ముందు చూపుతోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరమైంది. ఐటీ, ఫార్మా విద్యాసంస్థలు కాంగ్రెస్ తీసుకొచ్చినవే. మన్మోహన్ ఐటీఐఆర్ ఇస్తే..మోదీ,కేసీఆర్ రద్దు చేశారు. ఐటీఐఆర్ వచ్చి ఉంటే వేలాది నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చేవి. 2014--24 నుంచి జరిగిన అభివృద్ది ఏంటో చెప్పాలి.హైదరాబాద్ అభివృద్ధిపై మోదీ, కిషన్ రెడ్డి, కేటీఆర్ చెప్పాలి. సెక్రటేరియట్ లో పోచమ్మ టెంపుల్, మజీద్ కూలగొట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు రేవంత్.
కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ రూం, ప్రగతి భవన్ కేసీఆర్ కోసమే. కాళేశ్వరం కట్టడం కూలడం మూడేండ్లలో జరిగిపోయింది. రూ.2వేల కోట్లతో కొడుకు కోసం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కట్టించారు. కొడుకును సీఎం చేయాలని వాస్తుబాగు లేదని పాత సెక్రటేరియట్ కూల్చాడు. ప్రతిపక్ష నాయకులను సీసీ కెమెరాల్లో చూసేందుకు కంట్రోల్ రూం. కొత్త సెక్రటేరియట్ తో ప్రజలకు నయా పైసా లాభం ఉందా. ?తనకు తాను కాపాడుకోవడం కోసమే ప్రగతి భవన్ లో బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలు. పదేండ్ల వాళ్ళ పాలన ఇపుడు కాంగ్రెస్ పాలనతో పోల్చండి. హైటెక్ సిటీ పక్కన ఉన్న శిల్పారామం మేం నిర్మించినవే. హైదరాబాద్ దాహర్తి తీర్చేందుకు పదేండ్లు బీఆర్ఎస్ ప్లానేంటి.?. సిటీకి కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చింది మేమే అని రేవంత్ తెలిపారు..
సిటీకి మెట్రో ఎయిర్ పోర్టును తెచ్చింది వైస్, జైపాల్ రెడ్డే . సుల్తాన్ బజార్ లో మెట్రోను ఆపి వేల కోట్లు ఎల్ఎండ్ టీ నుంచి వసూలు చేశారు. ప్రజలు కట్టిన పన్నులు కేసీఆర్ ఎక్కడ ఖర్చు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఓఆర్ఆర్ ను పల్లీబఠానీలకు అమ్ముకున్నారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్. మేం ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నారు. కంటోన్మెంట్లో రూ.5 వేల కోట్లతో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది ఈ బ్యాడ్ బ్రదర్సే. ఈ బ్యాడ్ బ్రదర్స్ మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ, మూసీ,ట్రిపుల్ ఆర్ ను అడ్డుకుంటుంది ఈ బ్యాడ్ బ్రదర్సే.
ఏడాదిన్నరలో 3 లక్షలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఎల్ అండ్ టీని బ్లాక్ మెయిల్ చేసింది కేసీఆర్ కాదా?. ఎల్ అండ్ టీ దివాళ తీయడానికి కారణం కేసీఆర్. పదేళ్లలో ఒక్క కిలోమీటర్ మెట్రో అయినా విస్తరించారా? అని రేవంత్ ప్రశ్నించారు.
కేటీఆర్, హరీశ్ రావు వందలాది ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. నగరానికి కేసీఆర్ తెచ్చిన గొప్ప వరాలు గంజాయి డ్రగ్స్. హైదరాబాద్ ను డ్రగ్స్ కు అడ్డాగా మార్చింది కేటీఆర్ . జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో దొరికింది మీ బావమరిది కాదా కేటీఆర్?. పదేండ్లలో ఒక్క ఎయిర్ పోర్టు అయినా కట్టారా?. రాముగుండం, కొత్తగూడెంకు కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. రెండేండ్లలో ఓల్డ్ సిటలో రూ. 4వేల కోట్ల అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. మూసీ ప్రక్షాళనపై కిషన్ రెడ్డి ఎందుకు సహకరించట్లేదు. కిషన్ రెడ్డి..కేసీఆర్, కేటీఆర్ కు ఎందుకు లొంగిపోయావ్. విష సంస్కృతి తెచ్చిన కేటీఆర్ ,విషపురుగు. 695 చెరువుల్లో 44 చెరువులను బీఆర్ఎస్ లీడర్లు మింగేశారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
