హైదరాబాద్: దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ అనంతగిరిలో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు సంద ర్భంగా ఆయన మాట్లాడారు.. పైరవీలు చేయకుండా పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. తాను 19 ఏండ్లలో జెడ్బీ టీసీ నుంచి సీఎంగా ఎదిగానని అన్నారు.
తాను ప్రజా జీవితంలో ఎన్నడూ పైరవీలు చేయలేదని చెప్పారు. ప్రజా సమస్యల పైన గళం వినిపించానని అన్నారు. తనపై కేసులు పెట్టారని, నిన్న తాను కోర్టుకూ వెళ్లానని అన్నారు. పరువు నష్టం దావాలు వేసినా వెనుకడుగు వేయలేదని చెప్పారు. సోనియాగాంధీ పేరుతోనే తెలంగాణలోనే అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఐదేండ్ల పోరాటం వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారని, ఇందుకోసం దేశంలోని అనేక సమస్యలపై పోరాటం చేశారని చెప్పారు. ఈ దేశంలో రాహుల్ ప్రధాన మంత్రి కావాలంటే అందరం కలిసి మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉండన్నారు..
