జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ రాదని...రాసిపెట్టుకోవాలన్నారు సీఎం రేవంత్. బీజేపీ ఓడితే..హిందువులంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఒప్పుకుంటారా.. బండి సంజయ్ దీనిని రెఫరెండంగా భావిస్తారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవాలని కిషన్ రెడ్డికే లేదన్నారు రేవంత్. బీఆర్ఎస్ ను ఓడించండి..బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు రేవంత్.
ఏ ఎన్నికనైనా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానన్నారు రేవంత్.. పార్టీ అభ్యర్థి ఉన్న చోట తాను పోటీలో ఉన్నట్లే ఫీలవుతా... కేసీఆర్ లా ఫామ్ హౌస్ లో పడుకోవాలా? అని ప్రశ్నించారు రేవంత్. ప్రతీ ఎన్నిక తమ ప్రభుత్వ పనితీరుకు పరీక్షేనన్నారు. అండగా ఉంటే పదేళ్లలో అభివృద్ది ఏంటో చేసి చూపిస్తానన్నారు. సర్వేల గురించి తాను మాట్లాడనన్నారు రేవంత్..డబ్బులిచ్చి సర్వేలు చేయించుకుంటున్నారని ఆరోపించారు.
కిషన్ రెడ్డి..కేసీఆర్,కేటీఆర్ లకు లొంగిపోయారని విమర్శించారు. హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే..అవి కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు. హైదరాబాద్ ప్రజలు 2004 నుంచి 2014, 2014 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలన్నారు.కేసీఆర్ హైదరాబాద్ కు తెచ్చిన గొప్ప వరాలు..గంజాయి..డ్రగ్స్ అని విమర్శించారు. కేటీఆర్ హైదరాబాద్ ను డ్రగ్స్ కు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. బీజేపీ,బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్ అభివృద్దిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు రేవంత్. భవిష్యత్ కోసం జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు రేవంత్.
