తెలంగాణ పర్యటనలో భాగంగా పీఎం మోడీ హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ( మే 10 ) బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హెచ్ఐసీసీకి చేరుకున్నారు. హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంవోత్సవాలు చేశారు ప్రధాని మోడీ.ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. తెలంగాణను నెంబరు వన్ చేయడమే తమ లక్ష్యమని.. తెలంగాణ అభివృద్ధికి మోడీ సహకారం కావాలని అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి... రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి పెట్టాలని అన్నారు సీఎం రేవంత్. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రధాని మోడీపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయడమే తన లక్ష్యమని అన్నారు.
మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీకి సహకరించారని అన్నారు. తెలంగాణ విజ్ఞప్తులను మోడీ వెంటనే పరిష్కరించాలని అన్నారు సీఎం రేవంత్. మోడీని, కేంద్ర మంత్రులను తాను ఎన్నోసార్లు కలిశానని...దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు కానీ... తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అన్నారు సీఎం రేవంత్.
